SMS/WHATSAPP : +91 9494163388


CALL : +91 9494163388 | +91 (884) 2361143   (IST: 9:00 AM To 5:00 PM Only)

విశేషాలు

DEC 05

రాంకోసా నిర్వహణలో 2019 జనవరి 5,6 తేదీల్లో జరుగనున్న రంగరాయ మెడికల్ కాలేజి వజ్రోత్సవ, రాంకోసా స్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యఅతిథిగా వేంచేస్తున్నన్న భారత ఉపరాష్ట్రపతి గౌరవ వెంకయ్య నాయుడు గారు అందుకున్నారు. 5-12-2018 న ఉత్సవ సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు విజయవాడలో గౌరవ ఉపరాష్ట్రపతిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

postpost
డియర్ రాయల్ రంగరాయన్!

మీకు “డాక్టర్స్ డే” అభినందనలు! శుభాకాంక్షలు!!

మనం స్వస్ధలంలో, సమీపప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, దేశంలో, విదేశాల్లో దూరదూర తీరాలలో డాక్టర్లుగా అందిస్తున్న వైద్యసేవల వల్లా, గడిస్తున్న పేరు ప్రఖ్యాతుల వల్లా మనం పొందుతున్న సంతృప్తినీ, సాఫల్యాల అనుభవాలనీ స్పృశిస్తూ ప్రయాణిస్తూ ఒకసారి వెనక్కి వెళితే, 60 సంవత్సరాల గతం వద్ద ఆగుతుంది.

అక్కడ తేజోమయంగా కనిపించే మహావిద్యాలయం “కాకినాడ-రంగరాయ మెడికల్ కాలేజి”. నాకూ, మీకూ, మనందరికీ మద్య మనం ఏర్పాటు చేసుకున్న అంతర్ సూత్రం “రామ్కోసా” (రంగరాయ మెడికల్ కాలేజి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్) అనుభవంకూడా యాభై ఏళ్ళవుతున్నది.

గతింతిన జ్ఞాపకాలను - సాధించి విజయాలు కలసి కలబోసుకోవాలన్న భ్రమను, భ్రాంతిని తీర్చుకుని మళ్ళీ రీ చార్జ్ అవ్వడానికీ మరోసారి రిజువనేట్ అవ్వడానికీ మన కాలేజి 60 ఏళ్ళ వేడుకను, మన సంఘం 50 ఏళ్ళ ఉత్సవాన్ని వేదిక గా చేసుకుందాం! 2019 జనవరి 5,6 తేదీలలో కాకినాడలో జరిగే ఈ సంబరాల్లో భాగస్వాములు కావడానికి “రామ్కోసా” మీకొక “ఎక్స్ ప్రెస్ హైవే” అవుతుంది.

మీ వివరాలు మీరే రాసుకునే విధంగా, మీ సూచనలను నిర్వాహక సంఘం అందుకునే విధంగా www.ramcosa.in ను ఒక ఇంటరాక్టివ్ వెబ్ సైట్ గా ఆధునీకరించుకున్నాము. ఇమెయిల్ ద్వారా, వాట్సప్ ద్వారా,ఎస్ ఎం ఎస్ ద్వారా మీకు అనువైన సమయంలో మీరు ఈ వర్చువల్ ఆఫీస్ ను సంప్రదించవచ్చు. అవసరమైతే ఫోన్ ద్వారా మీకు సహకరించడానికి రామ్కోసా నిర్వాహక సిబ్బంది సిద్ధంగా వున్నారు.

వెబ్ సైట్ కు వెళ్ళండి. డైరక్టరీ చూడండి. మీపేరు లేకపోతే మీ వివరాలు ఫోన్ నంబర్ తో మెయిల్ చెయ్యండి .

మరో సారి డాక్టర్స్ డే అభినందనలు! శుభాకాంక్షలు

--టీమ్ రామ్కోసా

డియర్ రాయల్ రంగరాయన్!

కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి 60 వ వార్షికోత్సవం, పూర్వవిద్యార్ధుల సంస్థ - రామ్ కోసా 50 వ వార్షికోత్సవాలను 2019 జనవరి 5,6 తేదీలలో “మహా పున:స్సమాగ ఉత్సవంగా” నిర్వహించాలని అందుబాటులో రంగరాయన్లు నిర్ణయించి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

మీ భాగస్వామ్యం, సహాయ సహకారాలతో మాత్రమే ఇదంతా సాధ్యమౌతుంది. మన దగ్గర చాలా తక్కువ మంది రంగరాయన్ల ఫోన్ నంబర్లు, ఇ మెయిల్ ఐడిలు, పోస్టల్ అడ్రస్ లు వున్నాయి. చారిత్రాత్మకమైన వేడుకలో అందరూ పాల్గనేలా ఆహ్వానించడానికి ఇంకా అనేక అనేక మంది అడ్రస్ లు అవసరమౌతాయి.

ఇందువల్ల మీరు కొంత సమయం వెచ్చించి మీకు తెలిసివున్న ప్రతీ రంగరాయన్ ఫోన్, మెయిల్, అడ్రస్ వివరాలను మన ఆఫీస్ కు తెలియజేయాలని కోరుతున్నాము.

అలాగే ఈ ఉత్తరాన్ని వారందరికీ పంపి వారుకూడా వారికి తెలిసిన రంగరాయన్లకి పంపాలని కోరండి...ఇలాంటి చెయిన్ నిర్మాణం వల్ల రామ్ కోసా లో ప్రతీ ఒక్కరికీ సమాచారం అందుతుంది. అందరికీ కార్యక్రమాలు, ఆహ్వానాలు అందుతాయి. అందరూ సకుటుంబాలుగా పునస్సంగమ వేడుకల్లో పాలుపంచుకునే వీలు కుదురుతుంది.

మన సన్నాహాలలో మొదటి దశ కార్యక్రమం రామ్ కోసా లో అందరి ఫోన్లు, మెయిల్ ఐడిలు, అడ్రస్ ల సమీకరణ. ఇందుకు మీ కృషీ సహకారాలు ఈ రోజే మీరు ప్రారంభించాలని కోరుతున్నాము

అర్గనైజింగ్ కమిటీ నుంచి అభినందనలు, శుభాకాంక్షలతో

డాక్టర్ గన్ని భాస్కరరావు చైర్మన్

డాక్టర్ టి ఆనంద్, సెక్రటరీ

invitationtelugu